Wednesday, October 7, 2026
Homeతెలంగాణహైదరాబాద్చాక్లెట్ల ఆశ చూపి చిన్నారులను తీసుకెళ్లే...

చాక్లెట్ల ఆశ చూపి చిన్నారులను తీసుకెళ్లే యత్నం ?

📰 Generate e-Paper Clip

🔸బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీలో ఘటన.. అనుమానితుడిని పట్టుకున్న స్థానికులు

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీలో చిన్నారుల కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి ఇద్దరు చిన్నారులను చాక్లెట్ల ఆశ చూపి ఆటోలో తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. విషయం గమనించిన స్థానికులు అప్రమత్తమై ఆ వ్యక్తిని పట్టుకున్నారు.

స్థానికుల కథనం ప్రకారం.. కాలనీలో ఇద్దరు చిన్నారుల వద్దకు వచ్చిన సదరు వ్యక్తి చాక్లెట్లు ఇస్తానంటూ వారిని తన వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అనంతరం వారిని ఆటోలో ఎక్కించుకునేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే అతడిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే కొందరు స్థానికులు ఆ వ్యక్తిపై దాడి చేసినట్లు సమాచారం. అతడిని అదుపులోకి తీసుకుని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు అక్కడికి చేరుకుని అనుమానితుడిని తమ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలిసింది.

పలు గుర్తింపు కార్డులు స్వాధీనం

అనుమానితుడి వద్ద పోలీసులు పలు గుర్తింపు కార్డులను గుర్తించినట్లు సమాచారం. ఒక్కో కార్డుపై ఒక్కో పేరు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అతడి వివరాలు, గుర్తింపు, గత చరిత్రపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. చిన్నారులను నిజంగానే కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడా? లేక ఘటనకు మరేదైనా కారణముందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుడి నుంచి వివరాలు సేకరించి ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలను నిర్ధారించే పనిలో ఉన్నట్లు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!