Monday, September 7, 2026
Homeమేడ్చల్ జిల్లారూ.6 లక్షలతో UGD పనులకు శ్రీకారం

రూ.6 లక్షలతో UGD పనులకు శ్రీకారం

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : అలియాబాద్ పురపాలక సంఘం పరిధిలోని 9వ వార్డులో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (UGD) నిర్మాణ పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. మున్సిపల్ జనరల్ నిధుల నుంచి రూ.6 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. వార్డు ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించేందుకు UGD పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధికి మున్సిపాలిటీ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పనులు పూర్తయితే మురుగునీటి పారుదల సమస్యలు తగ్గి, ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకట్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ వడగం యమున శ్యామ్‌, కౌన్సిలర్లు గాడే వెంకటేష్, గూడె వెంకటేష్, ముద్దం సుధాకర్ రెడ్డి, సామల జశ్వంత్ రెడ్డి, వంగరి దినేష్, చేడు శ్రీనివాస్ రెడ్డి, సరసం అశోక్ రెడ్డి,AEE సనా షాహీన్, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

 

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!