- ఆర్ జె న్యూస్ , శామీర్ పేట : మేడ్చల్ జిల్లా అలియాబాద్ గ్రామంలో వినాయక లడ్డూ వేలం పాట ఘనంగా జరిగింది. గ్రామంలోని గడి వద్ద జై హనుమాన్ గుడ్ వీల్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో గురువారం లడ్డూ వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో అలియాబాద్ గ్రామానికి చెందిన కంభం శ్రీనివాస్ రెడ్డి రూ.3 లక్షల 87 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అలియాబాద్ లో రూ.3.87 లక్షలు పలికిన వినాయక లడ్డూ
RELATED ARTICLES
