ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బృందావన్ కాలనీలో వినాయక నిమజ్జనోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. బృందావన్ కాలనీ వాసులు ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గణేష్ లడ్డూ వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో బీజే కన్ స్ట్రక్షన్స్ అధినేత, జవహర్ నగర్ తొలి మేయర్ మేకల కావ్య తండ్రి మేకల అయ్యప్ప రూ.1,77,000లకు లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వామి వారి ఆశీస్సులు సమాజ శ్రేయస్సుకు, అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. అనంతరం భక్తుల జయజయధ్వానాల మధ్య గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికి నిమజ్జనం నిర్వహించారు. కార్యక్రమంలో కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

