ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, కీసర సర్కిల్, శామీర్‌పేట్ డివిజన్లోని అంతాయిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు జిల్లా ఆర్టీఏ సభ్యుడు భీమిడి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సామాగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకం సజావుగా అమలయ్యేందుకు పాఠశాలకు అవసరమైన వంట పాత్రలు, ఇతర వంట సామాగ్రిని అందజేశారు. అదేవిధంగా ప్రతి విద్యార్థికి స్టీల్ ప్లేట్లను పంపిణీ చేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటుగా నోట్ పుస్తకాలు, ఆరోగ్యకరమైన ఆహారం కోసం పండ్లను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భీమిడి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో కష్టపడి చదివి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆకాంక్షించారు. పాఠశాల ఉపాధ్యాయులు ఈ సహాయానికి కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులకు అందించిన సామాగ్రి వారికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు కుమారి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కత్తి రమేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు మంచాల మహేష్, అంగన్వాడీ టీచర్ జ్యోతి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
అంతాయిపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్లేట్లు, నోట్‌బుక్స్, పండ్లు అందజేత
RELATED ARTICLES
