Monday, August 17, 2026
HomeతెలంగాణGHMC"సర్" ప్రక్రియ సాఫీగా సాగాలి

“సర్” ప్రక్రియ సాఫీగా సాగాలి

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ఓటరు జాబితా సవరణ – “సర్” ప్రక్రియ సజావుగా, వేగంగా పూర్తయ్యేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ డివిజన్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. బుధవారం మేడ్చల్ డివిజన్ సర్ ఇన్చార్జి క్రిష్ణా రెడ్డి ఆధ్వర్యంలో ఆర్ ఆర్ ఫౌండేషన్ తరపున ఏర్పాటు చేసిన “సర్ హెల్ప్ డెస్క్”లను మేడ్చల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నడికొప్పు నాగరాజు – చాపరాజు ముదిరాజ్, ఆర్ ఆర్ ఫౌండేషన్ అధినేత, సీనియర్ నాయకులు రామన్నగారి రాఘవేందర్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ “సర్” ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని అన్నారు. నిజమైన ఓటర్లకు ఈ ప్రక్రియతో ఎలాంటి నష్టం జరగకుండా బీఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ సేవలు అందించాలని సూచించారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. మేడ్చల్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌లను పరిశీలించి, అక్కడికి వచ్చిన ఓటర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన ఫారాలను పూర్తి చేయడంలో కార్యకర్తలు సహాయం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ డివిజన్ సర్ ఇన్చార్జి క్రిష్ణా రెడ్డి, మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ, చిల్ల వెంకటేష్ ముదిరాజ్, కటిక వినయ్, ఇనాయత్ ఆలీ, సర్ ఇన్చార్జిలు చంద్రకాంత్, లింగం, బీఎల్ఏలు, బీఎల్ఓలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!