♦️ పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీ పనులకు ఆమోదం
ఆర్ జె న్యూస్ శామీర్ పేట : అలియాబాద్ పురపాలక సంఘ సాధారణ కౌన్సిల్ సమావేశంలో అభివృద్ధి పనులకు సంబంధించిన పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. శుక్రవారం అలియాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఛైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పారిశుద్ధ్యం, డ్రైనేజీ నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ, అంతర్గత రహదారుల మరమ్మతులు, పార్కుల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.వనమహోత్సవం నిర్వహణ, గ్రీన్ బడ్జెట్ అమలు, బోనాల పండుగ ఏర్పాట్లు, భూగర్భ మురికినీటి కాలువల నిర్వహణతో పాటు అభివృద్ధి పనులకు అవసరమైన పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఛైర్‌పర్సన్ సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన పనులను నాణ్యతతో పూర్తి చేస్తామని కమిషనర్ ఎన్. వెంకటరెడ్డి తెలిపారు. సమావేశంలో వైస్ ఛైర్‌పర్సన్ మాలతి మాధవరెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

