Sunday, August 16, 2026
Homeతెలంగాణమల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి,...

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన వాజ్‌పేయి నగర్ బీజేపీ యువకులు

ఆర్ జె న్యూస్, మల్కాజ్‌గిరి : వినాయక్‌నగర్ డివిజన్ పరిధిలోని వాజ్‌పేయి నగర్‌కు చెందిన పలువురు బీజేపీ యువకులు జక్కుల కిరణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈరోజు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి , మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సమక్షంలో నర్సింగ్ ముదిరాజ్, శ్యామ్, ప్రసాద్, రాజేష్, ఉమేష్, సుమేత్, యశ్వంత్, వెంకటేష్ యాదవ్, సాయిరామ్ సింగ్, నవీన్ కుమార్ తదితర యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరగా, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పనిచేస్తోందని అన్నారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, యువకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్‌లో చేరడం పార్టీపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు, ప్రాధాన్యత కల్పిస్తామని, పార్టీ బలోపేతానికి అందరూ సమిష్టిగా కృషి చేసి ప్రజల మధ్య పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వెంకన్న, జక్కుల కిరణ్, శ్రీకాంత్ యాదవ్, శ్రీధర్, విజయ్ రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!