Sunday, August 16, 2026
Homeమేడ్చల్ జిల్లాఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో...

ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి : మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంకి రమేష్

ఆర్ జె న్యూస్, అలియాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల్గొని తమ వివరాలను నమోదు చేయించుకోవాలని అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంకి రమేష్ విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మార్గదర్శకాల మేరకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అలియాబాద్ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలని పిలుపునిచ్చారు. జూలై 31లోపు పూర్తి చేసిన ఎన్యుమరేషన్, సంబంధిత ఫారాలను బూత్ లెవల్ అధికారులకు (బీఎల్‌వో) అందజేయాలని సూచించారు. సమర్పించిన వివరాల డిజిటలైజేషన్‌కు ఆగస్టు 3 వరకు మాత్రమే గడువు ఉందని తెలిపారు. నిర్ణీత గడువులోగా ఫారాలు సమర్పించని పక్షంలో ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రజల సమస్యలు ప్రభుత్వ దృష్టికి వెళ్లాలన్నా, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం లభించాలన్నా ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడం అవసరమని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!