Sunday, August 16, 2026
Homeక్రైమ్ న్యూస్కీసరలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

కీసరలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

♦️ 12 మంది అరెస్టు – రూ.16,900 నగదు స్వాధీనం..

ఆర్ జె న్యూస్, కీసర :

అహ్మదూడలోని డబుల్ బెడ్‌రూం ఫ్లాట్లలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై కీసర పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. డబుల్ బెడ్‌రూం ఫేజ్-1, బ్లాక్ నెం. 01, 5వ అంతస్తులోని గది నెం. 501లో ఎవరికీ తెలియకుండా కొందరు పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పేకాట ఆడుతున్న 12 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

♦️నగదు, ఇతర సామాగ్రి స్వాధీనం.

అరెస్టు చేసిన వారి నుంచి రూ. 16,900 నగదు, 19 పేకాట కట్టలు, 13 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఎం.జీ. బేగం పేకాట నిర్వహిస్తున్నట్లు, ఆమెకు అమీరోద్దిన్ సహకరిస్తున్నట్లు వెల్లడైంది.

♦️కేసు నమోదు

ఈ మేరకు 12 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు. ప్రాంతంలో జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై నిఘా కొనసాగుతుందని, అలాంటి వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు.

♦️బాక్స్ ఐటమ్ :

♦️స్వాధీనం చేసినవి :

♦️నగదు: రూ. 16,900

♦️పేకాట కట్టలు: 19

♦️మొబైల్ ఫోన్లు: 13

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!