Monday, August 17, 2026
Homeక్రైమ్ న్యూస్నకిలీ పత్రాలతో రూ.4.11 కోట్ల బ్యాంకు...

నకిలీ పత్రాలతో రూ.4.11 కోట్ల బ్యాంకు రుణాల మోసం..! కీసర పోలీసులకు పట్టుబడిన ముఠా..!

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : నకిలీ స్థిరాస్తి పత్రాలు సృష్టించి బ్యాంకులను మోసం చేస్తూ రూ.4.11 కోట్ల రుణాలు పొందిన ముఠాను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును ఛేదించినట్లు మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ వెల్లడించారు. కీసర పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వివరాలు వెల్లడించారు.

⚫ ఎలా చేశారంటే…

దర్యాప్తులో అసలు భూముల యజమానుల పేర్లతో నిందితులు నకిలీ సేల్ డీడ్‌లు, జీపీఏలు (GPA), అగ్రిమెంట్ ఆఫ్ సేల్, మెమొరాండం ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ (MOD) తదితర పత్రాలను తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నకిలీ పత్రాలను వివిధ బ్యాంకుల్లో సమర్పించి గృహ, ఆస్తి రుణాల పేరిట మొత్తం రూ.4.11 కోట్లు స్వాహా చేసినట్లు తేలింది.

⚫ ప్రధాన నిందితులతో పాటు అరెస్ట్

ఈ కేసులో ప్రధాన నిందితులతో పాటు మరికొందరిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు. వారి వద్ద నుంచి నకిలీ స్థిరాస్తి పత్రాలు, డిజిటల్ ఆధారాలు, మొబైల్ ఫోన్లు, ఇతర కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

⚫ ప్రజలకు డీసీపీ సూచన

ఈ సందర్భంగా డీసీపీ శ్రీధర్ మాట్లాడుతూ, భూముల కొనుగోలు, విక్రయాలు లేదా బ్యాంకు రుణాల సమయంలో పత్రాల ప్రామాణికతను సంబంధిత అధికారులతో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని సూచించారు. అనుమానాస్పద లావాదేవీలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!