Wednesday, September 9, 2026
HomeతెలంగాణGHMCపారిశ్రామికవాడ–కిష్టాపూర్‌ రోడ్డును బాగుచేయాలి

పారిశ్రామికవాడ–కిష్టాపూర్‌ రోడ్డును బాగుచేయాలి

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్,మేడ్చల్‌ : పారిశ్రామికవాడ–కిష్టాపూర్‌ రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని బీఆర్‌ఎస్‌ నాయకులు నవీన్‌రెడ్డి, తుడుం గణేశ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం పారిశ్రామికవాడ రోడ్డుపై వారు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రహదారి పూర్తిగా ధ్వంసమై ఏళ్లు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గుంతలతో దెబ్బతిన్న రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. రోడ్డు మరమ్మతులపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రహదారి వర్షాలు, భారీ వాహనాల రాకపోకలతో అధ్వానంగా మారిందని పేర్కొన్నారు. రోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారిపై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షాకాలం ముగిసే వరకు తాత్కాలికంగా ప్యాచ్‌వర్క్‌ చేపట్టి, అనంతరం శాశ్వత ప్రాతిపదికన తారురోడ్డు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మండల ఈశ్వరయ్య, విఠల్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!