గుండ్లపోచంపల్లి ( ఆర్ జె న్యూస్ ) జూలై 3:
గుండ్లపోచంపల్లి 299 డివిజన్ పరిధిలోని కండ్లకోయ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాజీ సర్పంచ్ బండారి నరేందర్ ముదిరాజ్‌కు మద్దతుగా సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాపాడిన సీనియర్ నాయకుడు బండారి నరేందర్‌కు డివిజన్ అధ్యక్ష పదవి ఇవ్వకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన నరేందర్‌కు అన్యాయం జరిగిందని, అధిష్ఠానం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కండ్లకోయ మాజీ సర్పంచ్ కందడి నరేందర్ రెడ్డి, మాజీ కో-ఆప్షన్ సభ్యులు గౌస్ పాషా, ఎర్రోళ్ల శ్రీనివాస్, శ్రీకాంత్, శివ, అరవింద్, రవీందర్ రెడ్డి, దీపక్, శ్రీనివాస్ గౌడ్, హరిబాబు, ఎర్రోళ యాదయ్య, బిక్షపతి, తల్లారి పెంటయ్య, వై. సిద్ధార్థ, తల్లారి శ్రీను, టి. వెంకటేష్, ఎర్రోళ విజయ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల గుండ్లపోచంపల్లి డివిజన్ అధ్యక్షుడిగా సురేందర్ ముదిరాజ్‌ను నియమించినప్పటి నుంచి స్థానికంగా అసంతృప్తి రగులుతోంది. ఈ నేపథ్యంలో నరేందర్‌కు మద్దతుగా నేతలు బహిరంగంగా ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది.
