ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : జీవీకే ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన బస్సు రాంగ్‌రూట్‌లో వచ్చి యాక్టివా వాహనాన్ని ఢీకొట్టిన ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఐటీఐ నుంచి లోటస్ వైపు బస్సు రాంగ్‌రూట్‌లో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు ఢీకొనడంతో ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని సాయిదొనిగడ్డ తండాకు చెందిన సాయికుమార్ నాయక్ (24) తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
🔸డ్రైవర్ రాజు స్వయంగా చెప్పాడంటూ..
ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్ రాజు స్వయంగా తాము రాంగ్‌రూట్‌లోనే వస్తామని చెప్పినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. స్కూల్ బస్సులో విద్యార్థులు ప్రయాణిస్తుండటంతో రాంగ్‌రూట్‌లో బస్సు నడపడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భద్రతపై పాఠశాల యాజమాన్యం, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
రాంగ్‌రూట్‌లో స్కూల్ బస్సు.. యాక్టివాకు ఢీ
RELATED ARTICLES
