Sunday, August 16, 2026
Homeతెలంగాణవిద్యారంగ సమస్యల పరిష్కారానికి తపస్ ఉద్యమం..!

విద్యారంగ సమస్యల పరిష్కారానికి తపస్ ఉద్యమం..!

♦️ఆగస్టు 1 ఇందిరాపార్క్ ధర్నాకు ఉపాధ్యాయుల మద్దతు కోరిన రాష్ట్ర కార్యదర్శి గడప నవీన్

ఆర్ జె న్యూస్, మేడ్చల్ :

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) డిమాండ్ చేసింది. ఆరు డీఏలు, పెండింగ్ పీఆర్‌సీ విడుదల, సీపీఎస్ రద్దు, హెల్త్ కార్డుల అమలు తదితర డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు మూడు దశల ఉద్యమ కార్యక్రమాలు చేపట్టినట్లు తపస్ రాష్ట్ర కార్యదర్శి గడప నవీన్ తెలిపారు. మొదటి దశలో తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించగా, రెండో దశలో జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించినట్లు చెప్పారు. మూడో దశలో భాగంగా ఆగస్టు 1న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా మేడ్చల్ మండల శిక్షణ కేంద్రంలో భోజన విరామ సమయంలో ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మండల విద్యాధికారి శంకరయ్యతో కలిసి పోస్టర్‌ను విడుదల చేసి, పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులను కలిసి ధర్నాకు మద్దతు కోరారు.ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర బాధ్యులు విస్లావత్ గోపాల్, జిల్లా బాధ్యులు రాంబాబు, మండల అధ్యక్షుడు మహేందర్, ప్రధాన కార్యదర్శి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!