🔸 ప్రధాని మోడీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా మేడ్చల్ రూరల్ జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు రాగం అర్జున్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లంపేట్ మున్సిపల్ అధ్యక్షుడు ఎక్కల్ దేవి శ్రీశైలం యాదవ్, రాష్ట్ర నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు గౌరవరం జగన్ గౌడ్, మేడ్చల్ డివిజన్ అధ్యక్షురాలు జల్లి శైలజ, ఎల్లంపేట్ మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రజిత-దేవేందర్ రెడ్డి, 2వ వార్డు కౌన్సిలర్ శారద రాజు నాయక్, ఎల్లంపేట మున్సిపల్ ప్రధాన కార్యదర్శి కంచుగంట మహేష్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
