Friday, October 2, 2026
Homeమేడ్చల్ జిల్లారక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికతకు బిట్స్...

రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికతకు బిట్స్ పిలానీ, డీఐఏటీ భారీ అడుగు

📰 Generate e-Paper Clip

🔸 హైదరాబాద్ లో డిఫెన్స్ & ఏరోస్పేస్ ఇండస్ట్రీ డే 2026.. 20 కీలక ఒప్పందాలు

ఆర్ జె న్యూస్, శామీర్ పేట : దేశ రక్షణ, ఏరోస్పేస్ రంగంలో స్వదేశీ ఆవిష్కరణలను వేగవంతం చేసే దిశగా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలానీ, పూణెలోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ (డీఐఏటీ) సంయుక్తంగా సోమవారం హైదరాబాద్ క్యాంపస్ లో ‘డిఫెన్స్ & ఏరోస్పేస్ ఇండస్ట్రీ డే 2026’ ను ఘనంగా నిర్వహించాయి.

“మిషన్-రెడీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇన్నోవేషన్ కోసం విద్యా-పరిశ్రమల వారధి” అనే థీమ్ తో నిర్వహించిన ఈ సదస్సుకు 45 ప్రముఖ కంపెనీలు, రక్షణ సంస్థల నుండి సుమారు 125 మంది పరిశ్రమ ప్రతినిధులు హాజరయ్యారు. డీఆర్డీవో, ఇస్రో, అటామిక్ ఎనర్జీ విభాగం, మిధాని, బీఈఎల్, హెచ్ఏఎల్ వంటి జాతీయ సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

20 కీలక ఒప్పందాలు, 48 సాంకేతికతల ప్రదర్శన

ఈ సదస్సులో బిట్స్ పిలానీ, డీఐఏటీ పూణె, ప్రముఖ రక్షణ, ఏరోస్పేస్ భాగస్వాముల మధ్య 20 అవగాహన ఒప్పందాలు (MoU) కుదిరాయి. సహకార పరిశోధన, సాంకేతిక బదిలీ, ఉమ్మడి వాణిజ్యీకరణకు ఇవి దోహదపడనున్నాయి. అదేవిధంగా అడ్వాన్స్డ్ మెటీరియల్స్, ఎలక్ట్రానిక్స్, ఏఐ, అటానమస్ సిస్టమ్స్, సెన్సార్లు, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగాల్లో 48 స్వదేశీ సాంకేతిక సామర్థ్యాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా డీఐఏటీ పూణె వైస్ ఛాన్సలర్ డాక్టర్ బీహెచ్వీఎస్ నారాయణ మూర్తి మాట్లాడుతూ.. “ప్రస్తుత అసమాన యుద్ధ పరిస్థితుల్లో డీఆర్డీవో, పరిశ్రమ, విద్యారంగం మధ్య సినర్జీ అత్యంత అవసరం” అని అన్నారు. డీఆర్డీవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ జగన్నాథ్ నాయక్ మాట్లాడుతూ పరిశోధన, అభివృద్ధి దశ నుండే పరిశ్రమలను భాగస్వాములను చేయాలని సూచించారు. కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ ఛైర్మన్ రాజిందర్ సింగ్ భాటియా మాట్లాడుతూ.. “అత్యాధునిక సాంకేతికతలను ఆవిష్కరించాలంటే వైఫల్యాన్ని స్వీకరించడం నేర్చుకోవాలి” అని పేర్కొన్నారు. బిట్స్ పిలానీ గ్రూప్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి. రామగోపాల్ రావు మాట్లాడుతూ.. “ల్యాబ్ లోని ఆవిష్కరణను వినియోగించదగిన సాంకేతికతగా మార్చడంలో ఈ సహకారం కీలక మైలురాయి” అని అన్నారు. మాజీ డీఆర్డీవో ఛైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి, ప్రొఫెసర్ రామగోపాల్ రావు సంయుక్త అధ్యక్షతన జరిగిన ఓపెన్ హౌస్ చర్చలో.. ఒప్పందాల అమలును వేగవంతం చేయడం, ఉమ్మడి పరిశోధనా ప్రయోగశాలల ఏర్పాటు, సులభతర ఐపీ ఫ్రేమ్ వర్క్ ల రూపకల్పన వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!