Tuesday, October 6, 2026
Homeక్రైమ్ న్యూస్శంషాబాద్ లో భారీ ఏటీఎం చోరీ...

శంషాబాద్ లో భారీ ఏటీఎం చోరీ – రూ.30 లక్షలతో ఉడాయించిన దొంగలు

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఏటీఎం చోరీ సంచలనం సృష్టించింది. శాతంరాయి వద్ద ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో రూ.30 లక్షలకు పైగా నగదు చోరీకి గురైంది. అర్ధరాత్రి సమయంలో ఏటీఎంలోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు ఏటీఎం మిషన్ ను ధ్వంసం చేసి, అందులోని నగదును ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న శంషాబాద్ పోలీసులు, క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం గాలింపు చేపట్టి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!