Tuesday, October 6, 2026
Homeక్రైమ్ న్యూస్చెరువు కట్టపై వ్యక్తి మృతదేహం

చెరువు కట్టపై వ్యక్తి మృతదేహం

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, మేడ్చల్‌: మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మురహరిపల్లి చెరువు కట్టపై ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడిని గుండ్లపోచంపల్లికి చెందిన నేమారం చౌదరి (55)గా గుర్తించారు.మేడ్చల్ ఎసిపి శంకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చౌదరి రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో శనివారం పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో కుటుంబ సభ్యులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. అయితే ఆదివారం మురహరిపల్లి చెరువు కట్టపై ఆయన మృతదేహం కనిపించింది. చౌదరి ఇంటి నుంచి బయలుదేరే సమయంలో తన వెంట రూ.10 లక్షల నగదు తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. దీంతో నగదు విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న మేడ్చల్‌ ఏసీపీ శంకర్‌రెడ్డి, సీఐ అంజిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇది హత్యా? ఆత్మహత్యా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది

.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!