Saturday, November 7, 2026
Homeక్రైమ్ న్యూస్దుండిగల్‌లో యువతిపై అత్యాచారం.. యువకుడిపై కేసు...

దుండిగల్‌లో యువతిపై అత్యాచారం.. యువకుడిపై కేసు నమోదు

📰 Generate e-Paper Clip

 🔸ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో చొరబడి అఘాయిత్యం

🔸ప్రేమించాలంటూ కొంతకాలంగా వేధింపులు.. బెదిరింపులు

🔸బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 19 ఏళ్ల డిగ్రీ విద్యార్థినిపై ఓ యువకుడు బలవంతంగా అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్‌లోని యేలూరి బస్తీకి చెందిన భవాని (19) డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదే కాలనీకి చెందిన రంజాన్ (23) గత ఎనిమిది నెలలుగా ఆమెకు పరిచయం. అతడిని సోదరుడిగా భావించినప్పటికీ, ఇటీవల తనను ప్రేమించాలని కోరినట్లు బాధితురాలు తెలిపింది. అందుకు నిరాకరించడంతో ప్రేమించకపోతే చంపుకుంటానని, లేదంటే ఆమెను చంపుతానని బెదిరిస్తూ వెంటపడుతూ వేధింపులకు గురిచేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది.ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తల్లి పనికి వెళ్లిన అనంతరం భవాని ఇంట్లో నిద్రిస్తుండగా, ఉదయం 6.30 గంటల సమయంలో రంజాన్ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించినట్లు తెలిపింది. ఆమె ప్రతిఘటించినప్పటికీ చేతులను వెనక్కి కట్టి, నోట్లో గుడ్డలు కుక్కి బలవంతంగా అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది.ఈ సమయంలో ఫోన్ రావడంతో బాధితురాలు సహాయం కోరగా, బంధువు సునీత అక్కడికి చేరుకుంది. అనంతరం నిందితుడు ఆమెతో వాగ్వాదానికి దిగినట్లు ఫిర్యాదులో వివరించింది.బాధితురాలి ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!