Saturday, November 7, 2026
Homeక్రైమ్ న్యూస్బాచుపల్లిలో తప్పిన పెను ప్రమాదం

బాచుపల్లిలో తప్పిన పెను ప్రమాదం

📰 Generate e-Paper Clip

🔸పాఠశాలలో ఏసీ స్విచ్‌బోర్డు వద్ద మంటలు.. అప్రమత్తమైన హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : బాచుపల్లిలోని ఓ ప్రీ ప్రైమరీ పాఠశాలలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లహరి గ్రీన్ పార్క్ రోడ్డులోని విఘ్నాన్ జ్యోతి ప్రీ ప్రైమరీ స్కూల్‌లో ఏసీ స్విచ్‌బోర్డు వద్ద విద్యుత్ స్పార్క్ కారణంగా పొగలు, మంటలు వ్యాపించాయి. మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.విద్యుత్ స్పార్క్‌తో తొలుత పొగలు వ్యాపించి, అనంతరం మంటలు చెలరేగడంతో పాఠశాల పరిసరాల్లో ఆందోళన నెలకొంది. అయితే ఘటన జరిగిన సమయంలో తరగతి గదుల్లో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.సమాచారం అందుకున్న హైడ్రా 49 బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. చిందం సంతోష్, చెగురి సంతోష్, మునుకుంట్ల శ్రీను, ఆకుల అశోక్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మరోవైపు జీడిమెట్ల అగ్నిమాపక సిబ్బంది సైతం హుటాహుటిన చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు సంభవించలేదు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!