Sunday, November 8, 2026
Homeక్రైమ్ న్యూస్డబిల్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

డబిల్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

📰 Generate e-Paper Clip

🔸తాను నడుపుతున్న సొంత ఆటో బోల్తా.. డ్రైవర్ శ్రీశైలం దుర్మరణం

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబిల్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాను స్వయంగా నడుపుకుంటున్న సొంత ఆటో (నంబర్: AP 23 W 8413) అదుపుతప్పి బోల్తా పడటంతో డ్రైవర్ కుమ్మరి శ్రీశైలం (35) దుర్మరణం చెందాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీశైలంను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. మృతుడికి భార్య తేజారాణితో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మేడ్చల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!