Wednesday, September 9, 2026
Homeమేడ్చల్ జిల్లాశాంతి నగర్‌లో ముత్యాలమ్మ కల్యాణోత్సవం..! అమ్మవారిని...

శాంతి నగర్‌లో ముత్యాలమ్మ కల్యాణోత్సవం..! అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, జవహర్ నగర్ : మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శాంతి నగర్ లో శ్రీ ముత్యాలమ్మ తల్లి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఈ కల్యాణోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. కల్యాణోత్సవానికి శాంతి నగర్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!