Monday, August 31, 2026
Homeమేడ్చల్ జిల్లానీట్ పరీక్ష కేంద్రాల తనిఖీ పకడ్బందీగా...

నీట్ పరీక్ష కేంద్రాల తనిఖీ పకడ్బందీగా పరీక్ష నిర్వహించాలని అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి ఆదేశం

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : జిల్లాలోని ఉప్పల్, మేడిపల్లి మండలాల్లో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష కేంద్రాలను మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి పరిశీలించారు. నాగోల్‌లోని సీఐఓఎస్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిర్జాదిగూడలోని సూర్య టెక్నాలజీ పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు.పరీక్ష కేంద్రాల్లోని వివిధ విభాగాలను తనిఖీ చేసి, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్ష నిర్వహణలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి తహసీల్దార్, పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!