Monday, September 7, 2026
Homeక్రైమ్ న్యూస్11 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి

11 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి

📰 Generate e-Paper Clip

🔸ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో గుర్తింపు.. యువకుడిపై తల్లి అనుమానం

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సైదోనిగడ్డ తండాలో 11 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. సైదోనిగడ్డ తండాకు చెందిన ధారావత్ శాంతి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆమెకు 11 ఏళ్ల కుమార్తె ధారావత్ యన్విత ఉంది.శుక్రవారం ఉదయం శాంతి కూలీ పనుల కోసం మేడ్చల్‌కు వెళ్లింది. సాయంత్రం సుమారు 6 గంటలకు ఇంటికి తిరిగి వచ్చి తలుపు తట్టగా కుమార్తె తలుపు తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆమె తన అక్క సూచనతో ఇంటి వెనుక వైపు వెళ్లి చూడగా బాలిక ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది.వెంటనే శాంతి కేకలు వేయడంతో బావ, ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని ఇంటి తలుపులు పగులగొట్టి బాలికను కిందకు దించారు. అయితే అప్పటికే బాలిక మృతి చెందినట్లు గుర్తించారు.కాగా, బాలికతో ఆడుకునే పిల్లలను తల్లి ఆరా తీయగా.. ఉదయం బాలిక ఆలయానికి వెళ్లిందని, అక్కడ ఓ మైనర్ బాలుడిని కలిసిందని వారు చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బాలిక తల్లి బాలుడు పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఘటనపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక మృతికి గల అసలు కారణాలు ఏమిటి?, ఘటనకు ముందు ఆమె ఎవరిని కలిసింది? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!