ఆర్.జె.న్యూస్, శామీర్‌పేట్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించే విధంగా ప్రచురిస్తున్న “అంబేద్కర్ కల్పిత నాయకుడు” పుస్తకాన్ని వెంటనే నిలుపుదల చేయాలని, పుస్తక ప్రచురణకర్త హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ, TGSRTC SC, ST EWA, రాష్ట్ర దళిత సేన శామీర్‌పేట్ నాయకులు ఆదివారం శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు పోలీస్ స్టేషన్‌లో సీఐ కి ఫిర్యాదు అందజేసి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించేలా ఉన్న పుస్తక ప్రచురణను నిలిపివేయడంతో పాటు, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ అధ్యక్షులు ఎం. వెంకటస్వామి, కార్యదర్శి దాసరి లక్ష్మయ్య, మధు, ఏ.డి. మధు, RTCEWA ప్రధాన కార్యదర్శి కె. కృష్ణ, సిపిఐ రాష్ట్ర నాయకులు సాయిలు గౌడ్, దళిత సేన నాయకులు మురళి, నీరుడు బాలేష్, బుర్క నర్సింగరావు, కైరా బాలు, బుర్క వెంకటేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.
అంబేద్కర్‌పై అవమానకర వ్యాఖ్యల పుస్తకాన్ని నిలిపివేయాలి
RELATED ARTICLES
