Thursday, September 10, 2026
Homeమేడ్చల్ జిల్లానీళ్ల సమస్య పరిష్కారానికి వినతి

నీళ్ల సమస్య పరిష్కారానికి వినతి

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూర్- కిష్టాపూర్ డివిజన్ రాఘవేంద్ర నగర్ నెలకొన్న నీళ్ల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ మాధురికి వినతి పత్రం సమర్పించారు. కాలనీకి సక్రమంగా నీళ్లు సరఫరా కావడం లేదని, నాలుగైదు రోజులకు ఒక మారుకూడా నీళ్లు ఇవ్వడంలేదని ఏఎంసీ దృష్టికి తీసుకువచ్చారు. ట్యాంకర్లు కొనడం భారంగా మారిందని, అవి కూడా ఒక్కోసారి దొరకడం లేదని తెలిపారు. వెంటనే నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇందుకు ఆమె స్పందిస్తూ త్వరలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సత్యపాల్ రెడ్డి, సహ కార్యదర్శి రాంప్రసాద్, కౌన్సిలర్ నిశితా రెడ్డి, సచిన్, కోట రమేష్, రాజి రెడ్డి, విజయ్, బస్వారాజ్, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!