Saturday, November 28, 2026
Homeక్రైమ్ న్యూస్కీసరలో ఏసీబీ మెరుపుదాడి.. డిప్యూటీ తహసీల్దార్‌...

కీసరలో ఏసీబీ మెరుపుదాడి.. డిప్యూటీ తహసీల్దార్‌ పట్టివేత!

📰 Generate e-Paper Clip

🔸రూ.5 లక్షలు లంచం డిమాండ్‌.. రూ.2.50 లక్షలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ

ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : ప్రభుత్వ కార్యాలయంలో లంచం డిమాండ్‌ చేసిన వ్యవహారంలో కీసర మండల డిప్యూటీ తహసీల్దార్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వ్యవసాయ భూములను 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు రూ.5 లక్షలు లంచం డిమాండ్‌ చేయగా, అందులో భాగంగా బుధవారం రూ.2.50 లక్షలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు రంగారెడ్డి రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌ కుమార్‌ మీడియాకు వెల్లడించారు.

నెలల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

కీసర మండల పరిధిలోని వ్యవసాయ భూములను 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు బాధితులు పలుమార్లు దరఖాస్తులు చేసుకున్నారని డీఎస్పీ తెలిపారు. నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఏసీబీని ఆశ్రయించినట్లు వివరించారు. ఈ క్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ సందీప్‌ కుమార్‌ రెడ్డి రూ.5 లక్షలు డిమాండ్‌ చేసినట్లు ఫిర్యాదు అందిందన్నారు. ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టి, రూ.2.50 లక్షలు తీసుకుంటున్న సమయంలో పట్టుకున్నట్లు వెల్లడించారు.

వీఆర్వో, ప్రైవేటు వ్యక్తి పాత్రపైనా విచారణ

ఈ వ్యవహారంలో వీఆర్వో విజయ్‌ కుమార్‌, ప్రైవేటు వ్యక్తి బాలకృష్ణ పాత్రపైనా ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.లంచం డిమాండ్‌ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!