Friday, November 27, 2026
Homeమేడ్చల్ జిల్లారూ.80 లక్షలతో సీసీ రోడ్డు పనులు...

రూ.80 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

📰 Generate e-Paper Clip

కోర్టు నుంచి కేఎల్ఆర్ కమాన్ వరకు 400 మీటర్ల రోడ్డు నిర్మాణం

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూర్ – కిష్టాపూర్ డివిజన్‌లో కార్పొరేషన్ నిధులు రూ.80 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు రొయ్యపల్లి మల్లేష్ గౌడ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కోర్టు నుంచి కేఎల్ఆర్ కమాన్ వరకు 9 మీటర్ల వెడల్పు, 400 మీటర్ల పొడవున సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. గతంలో రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యను సైబరాబాద్ కమిషనర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేసినట్లు పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణ పనులు పూర్తయితే స్థానిక ప్రజలకు రవాణా ఇబ్బందులు తొలగి సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వేముల శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ దేవ, శేఖర్ గౌడ్, రవీందర్ రెడ్డి, హనుమంత రెడ్డి, లింగం, రంజిత్, సాయి, గర్దాస్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!