Friday, November 27, 2026
Homeమేడ్చల్ జిల్లాఅలియాబాద్‌ 9వ వార్డులో అడిషనల్‌ కలెక్టర్‌...

అలియాబాద్‌ 9వ వార్డులో అడిషనల్‌ కలెక్టర్‌ పర్యటన

📰 Generate e-Paper Clip

🔸వారంలోగా తక్షణ సమస్యల పరిష్కారానికి చర్యలు.. 

🔸దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పిస్తాం: ఫైజాన్‌ అహ్మద్‌

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : అలియాబాద్‌ మున్సిపాలిటీలోని 9వ వార్డులో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా అడిషనల్‌ కలెక్టర్‌ (లోకల్‌ బాడీస్‌) ఫైజాన్‌ అహ్మద్‌ ఐఏఎస్‌ వార్డులో పర్యటించి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇటీవల వార్డుకు చెందిన స్థానికులు కలెక్టరేట్‌లో ఆయనను కలిసి తమ సమస్యలను వివరించగా, స్పందించిన ఆయన స్వయంగా వార్డును సందర్శించారు.ఈ సందర్భంగా విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు, అంతర్గత రహదారులు, డ్రైనేజీ సమస్యలు, పార్కు అభివృద్ధి, బోరు మోటారు ఏర్పాటు తదితర మౌలిక వసతుల సమస్యలను స్థానికులతో కలిసి పరిశీలించారు. ప్రజల నుంచి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సమస్యలకు ప్రాధాన్యమిస్తూ వారంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌, ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

రోడ్లు, డ్రైనేజీలు, పార్కు అభివృద్ధి వంటి దీర్ఘకాలిక సమస్యలకు సమగ్ర కార్యాచరణ రూపొందించి దశలవారీగా శాశ్వత పరిష్కారం కల్పిస్తామని అడిషనల్‌ కలెక్టర్‌ హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో మున్సిపల్‌ కమిషనర్‌ ఎన్‌.వెంకటరెడ్డి, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ సనా షహీన్‌, స్థానిక కౌన్సిలర్‌ యమునా శ్యామ్‌, స్థానిక నివాసి లతతో పాటు పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!