ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. కాప్రా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మెరుగు చంద్రమోహన్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి సమక్షంలో జరిగిన కార్యక్రమంలో క్లబ్ ముఖ్య సలహాదారులు బెలిదే అశోక్ గుప్తా, పలుగుల పవన్, ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు శనిగరం అశోక్, ఉపాధ్యక్షులు యావాపురం రవి, ప్రధాన కార్యదర్శి ముత్యం ముఖేష్ గౌడ్, కోశాధికారి వెంకట యోగి రామచంద్ర మూర్తి, సంయుక్త కార్యదర్శి కె. వెంకట్, సీనియర్ జర్నలిస్టులు యాట రాజు, చాప రవీందర్, కార్యవర్గ సభ్యులు బుడంపల్లి నిరంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు
RELATED ARTICLES
