Tuesday, September 8, 2026
Homeమేడ్చల్ జిల్లాగాయత్రి డిగ్రీ కళాశాలలో ఘనంగా బోనాల...

గాయత్రి డిగ్రీ కళాశాలలో ఘనంగా బోనాల ఉత్సవం

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ పట్టణంలోని గాయత్రి డిగ్రీ కళాశాలలో మంగళవారం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినులు సంప్రదాయబద్ధంగా బోనాలను అలంకరించి తీసుకొచ్చారు. అనంతరం విద్యార్థినులు పట్టణంలోని ఏడు గుడుల దేవాలయంలో కొలువైన అమ్మవార్లకు బోనాలను సమర్పించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బోనాల పండుగ విశిష్టతను, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థినులకు తెలియజేసేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థినుల సంప్రదాయ వస్త్రధారణ, బోనాల అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్య సభ్యులు గణేష్, శివ, కమలాకర్ రెడ్డి, దేవరాజ్, సత్యనారాయణ, శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!