Wednesday, September 9, 2026
Homeమేడ్చల్ జిల్లాఅలియాబాద్‌లో రూ.8 లక్షలతో CC రోడ్డు...

అలియాబాద్‌లో రూ.8 లక్షలతో CC రోడ్డు పనుల ప్రారంభం..! చైర్‌పర్సన్ శిరీష కృష్ణారెడ్డి శంకుస్థాపన

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, అలియాబాద్ : అలియాబాద్ పురపాలక సంఘం పరిధిలోని 1వ వార్డు మరియు 3వ వార్డుల్లో మున్సిపల్ జనరల్ నిధులతో చేపట్టిన CC రోడ్డు నిర్మాణ పనులను గురువారం చైర్‌పర్సన్ శ్రీమతి కంఠం శిరీష కృష్ణారెడ్డి ప్రారంభించారు. రూ.8.00 లక్షల వ్యయంతో చేపడుతున్న ఈ పనులతో స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలగనుంది.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ శిరీష మాట్లాడుతూ, అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన రహదారులు మరియు మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నామని తెలిపారు. మున్సిపాలిటీకి వచ్చే నిధులను పారదర్శకంగా, సకాలంలో పనులకు వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ శ్రీమతి కన్‌రెడ్డి మాలతి మాధవ రెడ్డి, కౌన్సిలర్లు హపావత్ వెంకటేష్, దాసరి రవి, హనుమాన్ దాస్, గురుకుల దీప, ముద్దం సుధాకర్ రెడ్డి, ఎల్లు దీపిక, యూసఫ్ బాబా, మున్సిపల్ AEE సనా షాహీన్, మున్సిపల్ సిబ్బంది మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!