Tuesday, September 8, 2026
Homeమేడ్చల్ జిల్లాతుర్కపల్లి వార్డులో ఘనంగా వన మహోత్సవం

తుర్కపల్లి వార్డులో ఘనంగా వన మహోత్సవం

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్,మేడ్చల్ : పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా అలియాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని తుర్కపల్లి వార్డు కార్యాలయ పరిధిలో వన మహోత్సవం – 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తుర్కపల్లి పరిధిలోని ఐదు వార్డులకు మొక్కలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని అధికారులు సూచించారు. ఇళ్ల వద్ద, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి క్రమం తప్పకుండా సంరక్షించాలని కోరారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ శిరీష కృష్ణారెడ్డి మాట్లాడుతూ. భవిష్యత్‌ తరాలకు పచ్చని, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు. కమిషనర్‌ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ. మున్సిపాలిటీ పరిధిలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు వన మహోత్సవం ద్వారా విస్తృతంగా మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్‌ ఎన్‌. వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు హపావత్‌ వెంకటేష్‌, గురుకుల దీపిక వెంకటేష్‌, దాసరి రవి, యెల్లు దీపిక, మొహమ్మద్‌ యూసుఫ్‌ బాబా, మున్సిపల్‌ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!