🔸జిల్లా బలోపేతం, సంక్షేమ పథకాల ప్రచారంపై చర్చ
🔸వజ్రేష్ యాదవ్ సహా పలువురు సీనియర్ల హాజరు
ఆర్.జె.న్యూస్,హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించిన ఏఐసీసీ ఇంచార్జ్ నటరాజన్ మీనాక్షి ఆధ్వర్యంలో ఆదివారం గాంధీ భవన్‌లో పొలిటికల్ ఎఫైర్ కమిటీ (PAC) సమావేశం జరిగింది.
🔸పార్టీ బలోపేతంపై చర్చ
ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, రాజకీయ అంశాలు, జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే రోజుల్లో ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహాలను రూపొందించారు. మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
🔸సంక్షేమ పథకాల ప్రచారంపై ఫోకస్
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సమావేశంలో నేతలు నిర్ణయించారు. నాయకులంతా సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రతి గడపకు చేరేలా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో PAC కమిటీ సభ్యులు హరివర్ధన్ రెడ్డి, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, కంటెస్ట్ ఎంపీ సునీత మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మైనంపల్లి హనుమంత్ రావు, కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గ ఇంచార్జులు కోలన్ హనుమంత్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రజోనోల్లా లక్ష్మి, సేవాదళ్ అధ్యక్షులు షఫీయుద్దీన్, మైనారిటీ సెల్ అధ్యక్షులు అజీజ్ బేగ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు చంద్రయ్య తదితరులు హాజరయ్యారు.
