Tuesday, September 8, 2026
Homeమేడ్చల్ జిల్లామేడ్చల్ ఎక్సైజ్‌కు కొత్త బాస్!

మేడ్చల్ ఎక్సైజ్‌కు కొత్త బాస్!

📰 Generate e-Paper Clip

🔸2009 బ్యాచ్ అధికారిణికి కీలక బాధ్యతలు
🔸మహబూబ్‌నగర్‌కు నవనీత రెడ్డి బదిలీ
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా 2009 బ్యాచ్‌కు చెందిన దీపిక బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సీఐగా విధులు నిర్వహించిన నవనీత రెడ్డి మహబూబ్‌నగర్‌కు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ఆలేరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓగా విధులు నిర్వహించిన దీపిక బదిలీపై మేడ్చల్‌కు వచ్చి నూతన సీఐగా బాధ్యతలు చేపట్టారు.

🔸అనుభవమే బలం..

2009లో ఎస్‌ఐగా తొలి పోస్టింగ్‌ను నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ప్రారంభించిన దీపిక.. అనంతరం 2012లో మేడ్చల్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహించారు. 2014లో తొలిసారిగా ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టి కామారెడ్డి జిల్లా దోమకొండలో విధులు నిర్వహించారు. అనంతరం నిజామాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో సుమారు ఆరేళ్లు సేవలందించారు. ఆ తర్వాత ఆలేరు ఎక్సైజ్ ఎస్‌హెచ్‌ఓగా విధులు నిర్వహించిన ఆమె.. తాజాగా మేడ్చల్ ఎక్సైజ్ సీఐగా బాధ్యతలు స్వీకరించారు.వివిధ ప్రాంతాల్లో, వివిధ విభాగాల్లో విధులు నిర్వహించిన అనుభవం ఉన్న దీపికకు మేడ్చల్ ఎక్సైజ్ బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

🔸అక్రమ మద్యంపై ఉక్కుపాదం

బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఐ దీపిక మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ పరిధిలో గంజాయి , డ్రగ్స్ ,అక్రమ మద్యం విక్రయాలు, గుడుంబా తయారీ, అక్రమ మద్యం రవాణాపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.చట్టవిరుద్ధకార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు నిరంతరం నిఘా కొనసాగిస్తామని, అక్రమాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మేడ్చల్ ప్రాంతంలో అక్రమ మద్యం తయారీ, విక్రయాలు, రవాణాను అరికట్టడంతో పాటు ఎక్సైజ్ చట్టాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో అక్రమ మద్యం కార్యకలాపాలను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు చర్యలు చేపడతామని సీఐ దీపిక తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!