Tuesday, September 8, 2026
Homeమేడ్చల్ జిల్లాసత్యనగర్ అధ్యక్షుడిగా 4వ సారి ఎస్.హరి...

సత్యనగర్ అధ్యక్షుడిగా 4వ సారి ఎస్.హరి ఏకగ్రీవ ఎన్నిక

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : సత్యనగర్ కాలనీ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎస్.హరి నాలుగోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం కాలనీలోని అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో నాల్గవసారి ఎన్నుకున్న కమిటీ సభ్యులకు, కాలనీ వాసులకు కృతజ్ఞతలు తెలిపారు. కాలనీ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతోనే మళ్లీ ఎన్నుకున్నారని, ఇది ఆనందంగా ఉందన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా సభ్యులతో కలిసి చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మోషే దయాన్, కార్యదర్శి ఖాజా రఫీఉద్దీన్ అహ్మద్, సంయుక్త కార్యదర్శి లింగారెడ్డి, కోశాధికారి సురేష్ కుమార్, సలహాదారులు సునీల్, కిష్టయ్య, వెంకటేశ్వర్లు, శ్రీరామ్ కుమార్, సంస్థాగత కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి, శీతల్ కుమార్, ఉమేష్, విఠల్ రావు, మహిళా విభాగం కల్పన, వసంత, కమిటీ సభ్యులు శ్రీనివాస్, కాశీనాథ్, ప్రదీప్, రాజు, బాబు నాయుడు, రాజా రావు, శివ శంకర్, డేనియల్, వినయ్ రాజ్, హనుమ నాయక్, ఆదర్శ్ పాఠక్, శివ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!