Thursday, October 8, 2026
Homeమేడ్చల్ జిల్లాఖైదీలకు విద్యతోనే పునరావాసం..! BRAOU స్నాతకోత్సవంలో...

ఖైదీలకు విద్యతోనే పునరావాసం..! BRAOU స్నాతకోత్సవంలో 10 మంది ఖైదీలకు పీజీ డిగ్రీలు

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్,వెబ్ డెస్క్ : డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) 27వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. NAAC మాజీ డైరెక్టర్, BRAOU మాజీ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ వి.ఎస్. ప్రసాద్ స్నాతకోత్సవ అతిథిగా పాల్గొన్నారు. ఈ స్నాతకోత్సవంలో తెలంగాణ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ శాఖకు చెందిన 10 మంది ఖైదీలు పీజీ విద్యను విజయవంతంగా పూర్తి చేసి డిగ్రీలు అందుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. వీరిలో 8 మంది ఎం.ఎస్సీ (సైకాలజీ), మరో ఇద్దరు ఎం.ఏ (సోషియాలజీ) కోర్సులను పూర్తి చేశారు. విశేషమేమిటంటే, ఈ విద్యార్థుల్లో పలువురు ఇప్పటికే ఉన్నత విద్యార్హతలు కలిగి ఉన్నప్పటికీ జైలులో ఉన్న సమయంలో తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. కొందరికి ఎల్‌ఎల్‌బీ, ఇతర డిగ్రీలు, బీటెక్ వంటి విద్యార్హతలు ఉన్నాయి. తెలంగాణ ప్రిజన్స్ శాఖ డీఐజీ డా. డి. శ్రీనివాస్, సెంట్రల్ ప్రిజన్ చర్లపల్లి సూపరింటెండెంట్ శ్రీ జి. ప్రమోద్ తదితరులు స్నాతకోత్సవానికి హాజరై పీజీ డిగ్రీలు అందుకున్న ఖైదీలను అభినందించారు. ఖైదీలలో విద్యను సంస్కరణ, పునరావాసం, సమాజంలో గౌరవప్రదమైన పునఃసమీకరణకు ముఖ్యమైన సాధనంగా తెలంగాణ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ శాఖ ప్రోత్సహిస్తున్న కృషికి ఈ విజయం నిదర్శనంగా నిలిచింది. జైలులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని విద్యను అభ్యసించడం ద్వారా విడుదల అనంతరం తమ జీవితాలను పునఃప్రారంభించుకునేలా ఖైదీలను ప్రోత్సహిస్తున్నట్లు అన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!