Saturday, August 29, 2026
Homeమేడ్చల్ జిల్లానల్గొండ ఉపాధ్యాయురాలి హత్యకు నిరసన. మేడ్చల్‌లో...

నల్గొండ ఉపాధ్యాయురాలి హత్యకు నిరసన. మేడ్చల్‌లో ‘శాంతి ర్యాలీ’

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్ మేడ్చల్ : నల్గొండ జిల్లా నాగార్జున హైస్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి రూపా రెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం TRSMA మేడ్చల్ మండల్ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రైవేట్ పాఠశాలలు బంద్ పాటించాయి.

🔸నివాళులర్పించి ర్యాలీ

ర్యాలీకి ముందు స్వామి వివేకానంద, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి హతురాలు రూపా రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఉపాధ్యాయుల భద్రతను కల్పించాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు.

🔸ప్రధాన డిమాండ్లు :

1. స్మార్ట్‌ఫోన్‌లపై కఠిన నిఘా : పిల్లలకు మొబైల్ ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు ఏం చూస్తున్నారో గమనించాలి. దుర్వినియోగానికి అవకాశం ఇవ్వొద్దని సూచించారు.

🔸 2.మానసిక ఒత్తిడికి చెక్ : పిల్లలపై అతి ప్రేమతో వారిని పాడు చేయొద్దు. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు తల్లిదండ్రులు పిల్లలతో స్నేహంగా మాట్లాడాలని కోరారు.

🔸 3. టీచర్లకు భద్రత కల్పించాలి : నవ సమాజాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయులు నేడు భయంతో పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను మందలించేందుకు కూడా టీచర్లు భయపడే పరిస్థితి ఉందని, దీనికి ప్రభుత్వం పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.

4 .ఇంటి వద్ద పర్యవేక్షణ : స్కూల్‌లో పిల్లలు బాధ్యతగా ఉంటున్నారని, ఇంటికి వెళ్లాక పర్యవేక్షణ లేకపోవడమే సమస్యలకు కారణమవుతోందని తెలిపారు.

🔸5 .PTM తప్పనిసరి : తల్లిదండ్రులు రోజువారీ/వారానికోసారి/నెలకోసారి జరిగే పేరెంట్-టీచర్ మీటింగ్‌లలో తప్పనిసరిగా పాల్గొని పిల్లల ప్రవర్తనపై చర్చించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో TRSMA మేడ్చల్ జిల్లా ట్రెజరర్ గిరిబాబు, మండల జనరల్ సెక్రటరీ రాధాకృష్ణ, ట్రెజరర్ GLV నారాయణ మూర్తి, వైస్ ప్రెసిడెంట్ లవకుమార్ గౌడ్, జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ రెడ్డి, కో-ఆప్షన్ మెంబర్లు మాథ్యూ జోసెఫ్, శ్రీనివాస్ రెడ్డి, రాకేష్ తో పాటు మండలంలోని వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!