ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : పోచారం మున్సిపాలిటీ మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి తండ్రి సింగిరెడ్డి బిక్షపతి రెడ్డి మృతి పట్ల మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తోటకూర వజ్రెష్ యాదవ్ సంతాపం తెలిపారు. శుక్రవారం బిక్షపతి రెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బిక్షపతి రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వజ్రెష్ యాదవ్ పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన అంతిమయాత్రలో ఆయన పాల్గొన్నారు.
సింగిరెడ్డి బిక్షపతి రెడ్డి మృతికి వజ్రెష్ యాదవ్ సంతాపం
RELATED ARTICLES
