ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : బాచుపల్లిలోని సిల్వర్ ఓక్స్ స్కూల్ గేట్ వద్ద సోమవారం ఉదయం మూర్ఛ (ఫిట్స్) వచ్చి పడిపోయిన గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. సోమవారం ఉదయం సిల్వర్ ఓక్స్ స్కూల్ ప్రధాన గేట్ సమీపంలో సుమారు 35–40 ఏళ్ల వయస్సు గల వ్యక్తి ఫిట్స్ వచ్చి స్పృహ కోల్పోయి పడిపోయి ఉండటాన్ని బాచుపల్లి పోలీస్ సిబ్బంది గుర్తించారు. వెంటనే స్పందించిన పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి, అక్కడ చేర్పించారు. అనంతరం గాంధీ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న అతడు గురువారం మధ్యాహ్నం మృతి చెందాడనే సమాచారం డాక్టర్స్ పోలీసులకి తెలిపారు. మృతుడి వివరాల ప్రకారం.. అతని ఎత్తు సుమారు 5 అడుగులు ఉండగా, చామనచాయ, నల్లటి జుట్టు కలిగి ఉన్నాడు. మృతి చెందిన సమయంలో పసుపు రంగు స్లీవ్‌లెస్ బనియన్, నీలం రంగు జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతుడిని గుర్తించిన వారు లేదా అతని కుటుంబ సభ్యులు బాచుపల్లి పోలీసులను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. మృతుడి ఆచూకీ, కుటుంబ సభ్యుల వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
బాచుపల్లిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి..! ఆచూకీ కోసం పోలీసుల విజ్ఞప్తి
RELATED ARTICLES
