Sunday, September 6, 2026
Homeమేడ్చల్ జిల్లాయువత చెడుసావాసాలకు దూరంగా ఉండాలి చదువు,...

యువత చెడుసావాసాలకు దూరంగా ఉండాలి చదువు, క్రీడలు, ఉద్యోగంపై దృష్టి సారించాలి : ఎమ్మెల్యే మల్లారెడ్డి

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : యువత చెడుసావాసాలకు బానిస కాకుండా చదువు, క్రీడలు, ఉద్యోగంపై దృష్టి సారించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సూచించారు. శామీర్పేట మండలంలో నిర్వహించిన బండి రాఘవరెడ్డి (బీఆర్ఆర్) స్మారక క్రికెట్ టోర్నమెంట్ సీజన్-1 ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన జై హనుమాన్ గుడ్విల్స్, ఆలియాబాద్ జట్టుకు ప్రథమ బహుమతిగా రూ.25 వేల నగదు, ద్వితీయ స్థానంలో నిలిచిన తుర్కపల్లి బుల్స్ జట్టుకు రూ.12,500 నగదు బహుమతులను ఎమ్మెల్యే మల్లారెడ్డి అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువతకు లభించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని అన్నారు. క్రీడల ద్వారా యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. క్రీడలతో శారీరక దృఢత్వంతోపాటు క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వాహకులు బండి రాంరెడ్డి, బండి శ్రీకర్‌రెడ్డి, కౌన్సిలర్లు కుమార్ యాదవ్, హనుమాన్‌దాస్, యూసఫ్ బాబా, బీఆర్ఎస్ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, మాజీ సర్పంచులు ఎల్లయ్య, చీదు శ్రీనివాస్, వంగ వెంకట్రెడ్డి, తూము శ్యామ్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, మాజీ సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, గోపి, శ్రీకాంత్‌రెడ్డి, తాడెం కుమార్, దేవేందర్, ప్రవీణ్, శంకర్‌రెడ్డి తదితరులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!