ఆర్ జె న్యూస్, మేడ్చల్ :
ఒడిశా నుంచి గంజాయిని తెప్పించి అక్రమంగా విక్రయిస్తున్న ఓ యువకుడిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మేడ్చల్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన అలోక్ సర్కార్ (20) ప్రస్తుతం కిస్తాపూర్ నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తన స్నేహితుడు సోహైల్ (22) సహకారంతో ఒడిశా నుంచి 2 కిలోల ఎండు గంజాయిని విక్రయాల కోసం తెప్పించినట్లు విచారణలో వెల్లడైంది.విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించిన పోలీసులు అలోక్ సర్కార్‌ను అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి సుమారు రూ.లక్ష రూపాయలు విలువైన 2 కిలోల ఎండు గంజాయితో పాటు ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన సహచరుడు సోహైల్ ప్రస్తుతం పరారీలో ఉండగా, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు మేడ్చల్ సీఐ సత్యనారాయణ వెల్లడించారు.
