మేడ్చల్ ( ఆర్ జె న్యూస్) జూలై 11 :
ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొల్తూరు గ్రామం 18వ వార్డులో సిందు భాగ్యమ్మ–స్వామి దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజిగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోమ్మలపల్లి నర్సింహులు యాదవ్, ముడుచింతలపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరై గృహప్రవేశాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాల సొంతింటి కల సాకారమవుతోందన్నారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి గృహం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మంద శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ శిల్పా యాదగిరి, మాజీ ఎంపీటీసీ బోగ్గుల వెంకటేష్, మున్సిపల్ సీనియర్ నాయకులు అనంతరెడ్డి, జైపాల్‌రెడ్డి, బాలకృష్ణ, పాండు ముదిరాజ్, పట్టబాల్ నర్సింహులు, తిరుపతి రెడ్డి, తాండూరి నర్సింహులు, మల్లేష్, శ్రీకాంత్ గౌడ్, కోర్రెపల్లి మహేష్, ప్రవీణ్, కీసరి బానుచందర్ తదితరులు పాల్గొన్నారు.
