Sunday, August 16, 2026
Homeమేడ్చల్ జిల్లాఘనంగా సీత్లా పండుగ

ఘనంగా సీత్లా పండుగ

ఆర్ జె న్యూస్, మూడుచింతలపల్లి : మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నాగిశెట్టిపల్లి తాండలో మంగళవారం గిరిజనులు సీత్లా పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా గిరిజనులు గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ నవీన్ నాయక్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభం కాగానే సీత్లా (బోనాల) పండుగను నిర్వహిస్తామన్నారు. పంటలు బాగా పండాలని, జీవాలు వ్యాధుల బారిన పడకుండా అమ్మవార్లకు ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు, యువత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!