Wednesday, November 4, 2026
Homeమేడ్చల్ జిల్లాసీఎంఆర్‌ఐటీలో 7 అవర్స్ స్లాబ్ హ్యాకథాన్‌కు...

సీఎంఆర్‌ఐటీలో 7 అవర్స్ స్లాబ్ హ్యాకథాన్‌కు ఘన ముగింపు

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ మున్సిపాలిటీ పరిధి కండ్లకోయలోని సీఎంఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్లాబ్ హ్యాకథాన్, ఐసీఎస్ కమ్యూనిటీ సహకారంతో 7 అవర్స్ హ్యాకథాన్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ హ్యాకథాన్‌లో తెలంగాణ వ్యాప్తంగా 75 టీంల నుంచి 200 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీఎస్ కమ్యూనిటీ ఫౌండర్ పి. కౌశిక్ మాట్లాడుతూ.. ఏఐ బ్రౌజర్ ఏజెంట్‌ను విద్యార్థులు ఎలా ఉపయోగించాలి, అందులోని వివిధ రకాల మాడ్యూల్స్‌పై విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం. జంగారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు హ్యాకథాన్స్, వర్క్‌షాపుల ద్వారా నైపుణ్యాలను పెంపొందించుకోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని సూచించారు. హ్యాకథాన్‌లో పాల్గొన్న ప్రతి విద్యార్థిని అభినందించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ బి. సత్యనారాయణ మాట్లాడుతూ.. ఇలాంటి సాంకేతిక సదస్సుల్లో ఎంత ఎక్కువగా పాల్గొంటే విద్యార్థులు అంతగా నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటారని, ఇవి ఉద్యోగాలకు బాటలు వేస్తాయన్నారు. హ్యాకథాన్ కన్వీనర్, ఏఐఎంఎల్ విభాగాధిపతి డాక్టర్ పి. శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇలాంటి సాంకేతిక సదస్సుల ద్వారా విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకుని ఉద్యోగాలు సాధించవచ్చని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐసీఎస్ కమ్యూనిటీ టెక్నికల్ హెడ్ ప్రభాస్, జడ్జెస్‌గా సంతోష్, హరి పవన్, బిపుల్, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ రమాప్రియ, స్టూడెంట్ కోఆర్డినేటర్ ఎం. రేవంత్, డీన్స్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!