Friday, October 30, 2026
Homeమేడ్చల్ జిల్లారేణుక నగర్‌లో ఉచిత కంటి వెలుగు...

రేణుక నగర్‌లో ఉచిత కంటి వెలుగు కార్యక్రమం

📰 Generate e-Paper Clip

ఉచితంగా కంటి పరీక్షలు, కళ్లద్దాల పంపిణీ – బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహణ

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు 187వ కాకతీయ నగర్ డివిజన్ పరిధిలోని రేణుక నగర్ కమిటీ హాల్‌లో ఉచిత కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి కళ్లద్దాలను పంపిణీ చేశారు. అలాగే బీపీ, షుగర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు.

187వ డివిజన్ కాకతీయ నగర్ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు చింతమల్ల జయలక్ష్మి, చింతమల్ల కపిలేశ్వర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రజలకు ఆరోగ్య సేవలను అందించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు స్థానికులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు యూసుఫ్ భాయ్, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజు యాదవ్, మల్కాజిగిరి సర్కిల్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రొట్టెల ధరణ్, చెన్నారెడ్డి, డివిజన్ జనరల్ సెక్రటరీ జాన్ అర్వరాజు, మహేష్, మనోజ్ చారి, అక్బర్, రహీమ్, శ్రీనివాస్ గౌడ్, సాయి శ్రీకాంత్‌తో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!