🔸సమయానికి చేరుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించిన 108 సిబ్బంది
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : గ్యాస్ సిలిండర్ పేలడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన మేడ్చల్‌లో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో అప్రమత్తమైన స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రథమ చికిత్స అందించారు.ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ధర్మేంద్ర (23) కండ్లకోయలోని మయూర్ ఇండియా చాక్లెట్ కంపెనీలో పనిచేస్తూ మల్లన్న కాలనీలో నివాసం ఉంటున్నాడు. వంట చేస్తున్న క్రమంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో అతడి శరీరం తీవ్రంగా కాలిపోయింది.సమాచారం అందుకున్న మేడ్చల్ 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ సీతారాం, పైలట్ కరుణాకర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈఆర్‌సీపీ వైద్యుడు డాక్టర్ చక్రవర్తి సూచనల మేరకు బాధితుడికి ప్రథమ చికిత్స అందించి ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ధర్మేంద్ర పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సకాలంలో స్పందించి బాధితుడిని ఆస్పత్రికి తరలించిన 108 సిబ్బంది సీతారాం, కరుణాకర్‌లకు స్థానికులు, బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
