🔸అంబేద్కర్ నగర్ ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు ఢీకొని స్వామి దుర్మరణం
ఆర్ జె న్యూస్, జవహర్‌నగర్ : జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో స్వామి (32) అనే యువకుడు మృతి చెందాడు. అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. అంబేద్కర్ నగర్‌కు చెందిన స్వామి యాక్టివా ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, TS 08 Z 0171 నంబర్ గల ఆర్టీసీ బస్సు ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్వామి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. మృతుడు స్వామికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించాల్సి ఉంది.
