Thursday, September 10, 2026
Homeమేడ్చల్ జిల్లాకేసీఆర్ నగర్‌లో వైభవంగా ఆషాడ మాసం...

కేసీఆర్ నగర్‌లో వైభవంగా ఆషాడ మాసం బోనాలు

📰 Generate e-Paper Clip

🔸అమ్మవారికి మొక్కులు చెల్లించిన జవహర్ నగర్ మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్

ఆర్.జె.న్యూస్, జవహర్ నగర్ : కీసర సర్కిల్, జవహర్ నగర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్‌లో ఆషాడ మాస బోనాల పండుగ ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక మహిళలు, భక్తులు భక్తిశ్రద్ధలతో పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు.
ఈ కార్యక్రమానికి జవహర్ నగర్ మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆషాడ మాస బోనాల పండుగ మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అని, అమ్మవారి దయతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ధన్‌రాజ్, సతీష్, శ్రీకాంత్, మారుతి, చంద్రశేఖర్, రాజేందర్ నాయకులతో పాటు స్థానిక బస్తీవాసులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!